భారతదేశం, ఏప్రిల్ 30 -- UGC NET 2024 postponed : యూజీసీ నెట్ 2024 పరీక్షలు వాయిదా పడ్డాయి. గతంలో చెప్పిన డేట్​ నుంచి రెండు రోజులకు వాయిదా పడ్డాయి. ఫలితంగా.. నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ ఎన్​టీఏ.. జూన్​ 16న నిర్వహించాల్సిన యూజీసీ నెట్​ 2024.. జూన్​ 18కి వాయిదా పడింది. ఈ విషయాన్ని యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ తెలిపారు.

"అభ్యర్థుల ఫీడ్​బ్యాక్​ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ కూడా వెలువడుతుంది," అని మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో యూజీసీ ఛైర్మన్ పోస్ట్​ చేశారు.

UGC NET 2024 exam date : "అభ్యర్థుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ కారణంగా యూజీసీ నెట్ ను జూన్ 16 (ఆదివారం) నుంచి 18 జూన్ 2024 (మంగళవారం)కు మార్చాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, యూజీసీ నిర్ణయించాయి. ఎన్​టీఏ యూజీసీ-నెట్​...