ఆంధ్రప్రదేశ్,తిరుమల, మే 5 -- SV Traditional Sculpture Institution Admissions 2024 : శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాల నోటిఫికేషన్(SVITSA Admissions) వచ్చేసింది ఈ మేరకు టీటీడీ వివరాలను వెల్లడించింది.

టీటీడీ(TTD) ఆధ్వర్యంలో ఈ కాలేజీ నడుస్తుంది. 202-25 విద్యాసంవత్సరానికి గాను సాంప్రదాయ కళంకారి కళలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనుంది. ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

కళాశాలలో జూలై 17వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని టీటీడీ(Tirumala Tirupati Devasthanams) తెలిపింది. 4 సంవత్సరాల డిప్లొమా, 2 సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సులో చేరే విద్యార్థులు.. ఇతర వివరాల కోసం www.tirumala.org వెబ్‌సైట్‌ను చూడొచ్చు. తిరుమలలోని కళాశాల కార్యాలయాన్ని లేదా 0877-2264637, 9866997290 నంబర్ల ద్వా...