భారతదేశం, మే 10 -- TTD SV Music College: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వ‌రం, డోలు పాఠ‌శాల‌లో 2024-25 విద్యా సంవత్సరాలకు గాను రెగ్యుల‌ర్ కోర్సుల్లో ప్రవేశాల‌కు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మే 25వ తేదీ నుండి క‌ళాశాల‌లో ద‌ర‌ఖాస్తులు జారీ చేస్తారు. పూర్తిచేసిన ద‌ర‌ఖాస్తులను మే 25వ తేదీ వ‌ర‌కు జూన్ 12వ తేదీలోపు సమర్పించాలి.

ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో గాత్రం, వ‌యోలిన్‌, వీణ‌, ఫ్లూట్‌, నాద‌స్వ‌రం, భ‌ర‌త‌నాట్యం, హ‌రిక‌థ‌, మృదంగం, డోలు, ఘ‌టం విభాగాల్లో ఫుల్‌టైమ్ విశార‌ద‌(డిప్లొమా), ప్ర‌వీణ‌(అడ్వాన్డ్స్ డిప్లొమా) కోర్సులు ఉన్నాయి. ఎస్వీ నాద‌స్వ‌రం, డోలు పాఠ‌శాల‌లో ఫుల్‌టైమ్ స‌ర్టిఫికేట్‌, డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఇత‌ర ప్రాంతాల విద్యార్థుల‌కు కళాశాలలో హాస్ట‌...