భారతదేశం, ఏప్రిల్ 30 -- TS Tribal Welfare Schools : తెలంగాణ పదో తరగతి ఫలితాలు(TS 10th Results 2024) ఇవాళ విడుదలయ్యాయి. ఈ ఏడాది పది పరీక్షల్లో 91.31 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది ఎస్ఎస్సీ ఫలితాల్లో(TS SSC Results) తెలంగాణ గిరిజన గురుకుల విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించారు. గురుకుల విద్యాలయాలు సరాసరి 97.26 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ సంవత్సరం 33 మంది విద్యార్థులు 10 CGPA సాధించగా, 38 పాఠశాలలు నూటకి నూరు శాతం పాస్ పర్సెంటేజ్ సాధించాయి. గిరిజన ఆశ్రమ స్కూళ్లు టెన్త్ ఫలితాల్లో రికార్డులు సృష్టించాయి. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 11.75 శాతం పెరిగింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలు 2024 ఫలితాల్లో 89.64 శాతం ఉత్తీర్ణత సాధించగా, గతేడాది ఫలితాల్లో 77.89 శాతం ఉత్తీర్ణత సాధించాయి.

గిరిజన గురుకుల పాఠశాలల(TS Gurukula Schools) ఉపాధ్యాయుల శ్రమ, విద్య...