తెలంగాణ,హైదరాబాద్, మే 5 -- TS SET Notification 2024 Updates: తెలంగాణ సెట్ - 2024(Telangana State Eligibility Test) నోటిఫికేషన్ వచ్చేసింది. శనివారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ మేరకు ముఖ్య తేదీలను ప్రకటించారు.

ఈ ఏడాది కూడా తెలంగాణ సెట్ - 2024(Telangana State Eligibility Test Exam) పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ(OU) నిర్వహించనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు.

మే14వ తేదీ నుంచి తెలంగాణ సెట్ దరఖాస్తులు(TS SET Applications 2024) ప్రారంభం కానున్నాయి. ఆన్ లైన్ లోనే దరఖాస్తులను సమర్పించాలి. జూలై 2వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది. ఫైన్ తో జూలై 26వ తేదీ వరకు అప్...