భారతదేశం, మే 1 -- TS ICET 2024 Updates : తెలంగాణ ఐసెట్(TS ICET 2024) దరఖాస్తుల గడువును పొడిగించారు. తెలంగాణ ఐసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 5న విడుదల చేయగా, ఏప్రిల్ 30 వరకు అప్లికేషన్లు(TS ICET Applications) స్వీకరించారు. అయితే తాజాగా ఈ గడువును మే 7 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 7వ తేదీ వరకు ఐసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అదే విధంగా రూ.250 ఆలస్య రుసుముతో మే 17 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఐసెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లను(ICET hall Tickets) మే 28న ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఐసెట్ పరీక్షను జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించనున్నారు. ఐసెట్ ఫలితాలు(TS ICET Results 2024) జూన్ 28న విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఐసెట్ ను వ...