తెలంగాణ,హైదరాబాద్, మే 19 -- TS ECET 2024 Results : తెలంగాణ ఈసెట్ - 2024 ఫలితాలు వచ్చేస్తున్నాయ్. ఇందుకు అధికారులు ముహుర్తం ఫిక్స్ చేశారు. మే 20వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. https://ecet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

బీటెక్‌ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం తెలంగాణ ఈసెట్ - 2024 పరీక్షను నిర్వహిస్తున్నారు. మే 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరిగింది. ఈ పరీక్ష ఫలితాల్లో వచ్చిన ర్యాంకల ఆధారంగా... పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశాలు పొందుతారు. ఈ ఏడాది ఈసెట్ పరీక్షను ఉస్మానియా వర్శిటీ నిర్వహించింది.

TS PGECET 2024 Updates : తెలంగాణలో పీజీఈసెట్‌ -2024 పరీక్షల షెడ్యూల్ ...