Hyderabad, ఏప్రిల్ 25 -- Top Animated Movies on OTT: సమ్మర్ హాలిడేస్ (summer holidays) వచ్చేశాయి. మధ్యాహ్నం సమయంలో పిల్లలను బయటకు పంపకుండా ఓటీటీల్లోని ఈ యానిమేటెడ్ మూవీస్ వాళ్లకు చూపించండి. వాళ్లతో కలిసి మీరూ చూసేయండి. కాసేపు సరదాగా నవ్వుకోవడానికి యానిమేటెడ్ మూవీస్ కంటే బెస్ట్ ఛాయిస్ ఏముంటుంది చెప్పండి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కలిసి చూసే టాప్ యానిమేటెడ్ మూవీస్ లిస్ట్ ఇదే.

ఓటీటీలు వచ్చిన తర్వాత సెన్సార్ పక్కకు పోయింది. బూతు కంటెంట్ నట్టింటికి చేరింది. ఇలాంటి కంటెంట్ మీ పిల్లల కంట పడకుండా వారి కోసమే రూపొందించిన యానిమేటెడ్ సినిమాలు బెస్ట్ ఛాయిస్ గా చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో ఉన్న ఈ మూవీస్ సమ్మర్ హాలిడేస్ లో చూడండి.

ఇన్‌సైడ్ ఔట్ 2015లో వచ్చిన ఓ ఫ్యామిలీ మూవీ. యానిమేటెడ్ మూవీ...