భారతదేశం, ఏప్రిల్ 28 -- Siddipet News : త్రిపుల్ రైడింగ్(Triple raiding), మైనర్ డ్రైవింగ్, వాహనాలకు సైరన్ (siren)లు, డబుల్ సైలెన్సర్లను అమర్చితే కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. జిల్లాలో మైనర్ డ్రైవింగ్, త్రిపుల్ డ్రైవింగ్, నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ సైరన్ లు, అధిక శబ్దాలు వచ్చేలా వాహనాలకు సైలెన్సర్లు బిగించే వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామని, పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత నెల రోజుల వ్యవధిలో జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు సైరన్లు బిగించిన 10 వాహనలపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశామన్నారు. త్రిపుల్ రైడింగ్ చేసే వారిపై 250 మందికి జరిమానా విధించి కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది. మైనర్ డ్రైవింగ్ చేసే వారిపై 50 కేసులు నమోదు, వాహనాలకు డబుల్ సైలెన్సర్లు బిగ...