Hyderabad, మే 3 -- Siddharth Heeramandi Review: ప్రస్తుతం ఓటీటీలో సంచలనం రేపుతున్న వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. నెట్‌ఫ్లిక్స్ లో బుధవారం (మే 1) నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. తాజాగా ఈ సిరీస్ లో నటించిన అదితి రావ్ హైదరీ కాబోయే భర్త సిద్ధార్థ్ ఈ వెబ్ సిరీస్ రివ్యూ ఇచ్చాడు. అతడు దీనిపై ప్రశంసల వర్షం కురిపించాడు.

హీరామండి వెబ్ సిరీస్ లో బిబ్బోజాన్ అనే పాత్రలో నటించింది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ గా తెరకెక్కిన హీరామండిని తాజాగా చూసిన సిద్ధార్థ్ సోషల్ మీడియా ద్వారా రివ్యూ ఇచ్చాడు. ఈ మధ్యే అదితి, సిద్ధార్థ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన కాబోయే భార్య నటించిన హీరామండిపై ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సిద్ధార్థ్ రివ్యూ ఇవ్వడం విశేషం.

"యాక్టింగ్, మ్యూజిక్, సౌందర్యం, డ్రామ...