Hyderabad, మే 3 -- Salaar TRP: ఒకప్పుడు టీవీలో చాన్నాళ్ల తర్వాత ఓ హిట్ సినిమా వచ్చినా మంచి టీఆర్పీ నమోదయ్యేది. కనీసం రెండంకెల టీఆర్పీలను సినిమాలు సొంతం చేసుకునేవి. కానీ క్రమంగా ఈ టీఆర్పీలు తగ్గిపోతూ వస్తున్నాయి. తాజాగా ప్రభాస్ నటించిన సలార్ మూవీ టీఆర్పీ దారుణంగా ఉంది. ఈ మధ్యే ఈ సినిమా స్టార్ మా ఛానెల్లో టెలికాస్ట్ అయింది.

సలార్ సినిమాకు కేవలం 6.5 టీఆర్పీ మాత్రమే రావడం గమనార్హం. నిజానికి ఈ మధ్య కాలంలో జెమినీ టీవీల్లో వస్తున్న సినిమాలకు లోయెస్ట్ టీఆర్పీలు నమోదవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ స్టార్ మా ఛానెల్లో వచ్చిన ఈ సలార్ ను కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన గుంటూరు కారం, నా సామిరంగ లాంటి సినిమాలు కూడా దీనికంటే ఎక్కువ టీఆర్పీ సొంతం చేసుకున్నాయి.

నాగార్జున నటించిన నా సామిరంగ మూవీకి 8 టీఆర్పీ నమోదైంది. కానీ సలార్ అంతకంటే...