Hyderabad, మే 4 -- Rhododendron: హిమాలయాల చుట్టుపక్కల ఎర్రటి తివాచీ పరిచినట్టు కనిపిస్తాయి రోడోడెండ్రాన్ పువ్వులు. ఎరుపు మాత్రమే కాదు లేత గులాబీ పసుపు రంగులో కూడా ఈ పువ్వులు వేలాదిగా వికసిస్తాయి. ఇవి వికసించాక ఆ ప్రాంతాన్ని చూసేందుకు ఎంతో మంది పర్యాటకులు వెళ్తారు. సాధారణంగా ఈ పువ్వులు వసంతకాల ప్రారంభాన్ని సూచిస్తాయి. ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ మధ్యలో ఈ పువ్వులు వికసిస్తాయి. కానీ ఈ ఏడాది అసాధారణంగా అవి డిసెంబర్, జనవరి నెలలోనే వికసించాయి. దీంతో శాస్త్రవేత్తలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ పువ్వులు రెండు మూడు నెలల ముందే వికసించాయంటే గ్లోబల్ వార్మింగ్ అధికంగా ఉందని వారు అంటున్నారు.

కొండల్లో పెరిగే పుష్పించే మొక్కలు రోడోడెండ్రాన్. ఇవి పుష్పించడానికి 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. హిమాలయాల ప్రాంతాలలో ఆ ఉష్ణోగ్రతకు రావాలంటే మార్...