Hyderabad, మే 9 -- Rathnam OTT Release: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రత్నం. ఈ సినిమాకు మాస్ అండ్ యాక్షన్ చిత్రాలకు పేరుగాంచిన డైరెక్టర్ హరి దర్శకత్వం వహించారు. హరి-విశాల్ కాంబినేషన్‌లో ఇదివరకు భరణి, పూజా సినిమాలు వచ్చాయి. ఈ కాంబినేషన్‌లో మూడో సినిమాగా రత్నం రావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.

విశాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన రత్నం సినిమా తమిళంతోపాటు తెలుగులో ఏప్రిల్ 26న థియేటర్లలో విడుదలైంది. రత్నం సినిమాను తమిళనాడులో 500 స్క్రీన్‌లకు పైగా విడుదల కాగా గ్లోబల్ స్క్రీన్ కౌంట్ 100 స్క్రీన్‌లకు పైగా రిలీజ్ అయింది. సుమారు 2 గంటల 36 నిమిషాలు ఉంటుందని కూడా సమాచారం.

అయితే అటు తమిళనాట, ఇటు తెలుగు రాష్ట్రాల్లో రత్నం సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా బాగున్నాయని టాక్ వచ్చింది. సె...