Hyderabad, మే 2 -- Pushpa 2 first single: అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మూవీ నుంచి పుష్ప పుష్ప అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజైన విషయం తెలుసు కదా. బుధవారం (మే 1) ఈ సాంగ్ రిలీజ్ కాగా.. యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. తొలి 24 గంటల్లో తెలుగు రాష్ట్రాలు, ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం విశేషం.

పుష్ప 2: ది రూల్ మూవీ నుంచి ఈ ఫస్ట్ సింగిల్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సాంగ్ తెలుగు, హిందీ లిరికిల్ వెర్షన్లు గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ లో ఎక్కువ మంది చూసిన వీడియోలుగా నిలవడం విశేషం. ఈ విషయాన్ని పుష్ప 2 మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. పుష్ప పుష్ప వరల్డ్ వైడ్ చార్ట్‌బస్టర్ అంటూ ఓ సరికొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఇందులో అల్లు అర్జున్ తనదైన స్టైల్లో నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోను వెనుక నుంచి ...