భారతదేశం, మే 3 -- Prasanna Vadanam Review: స‌హ‌జ‌త్వంతో కూడిన ప్రేమ‌క‌థ‌ల‌తో హీరోగా టాలీవుడ్‌లో చ‌క్క‌టి విజ‌యాల్ని అందుకున్నాడు సుహాస్‌ (Suhas). త‌న పంథాకు భిన్నంగా తొలిసారి క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌ను ఎంచుకొని సుహాస్ న‌టించిన తాజా సినిమా ప్ర‌స‌న్న‌వ‌ద‌నం(Prasanna Vadanam Movie). ఈ మూవీ అర్జున్ వైకే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.శుక్ర‌వారం ప్ర‌స‌న్న‌వ‌ద‌నం సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. రాశీసింగ్‌, పాయ‌ల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా న‌టించారు.ప్ర‌స‌న్న వ‌ద‌నం సినిమా ఎలా ఉంది? క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌తో సుహాస్ హిట్ కొట్టాడా? లేదా? అంటే?

సూర్య (సుహాస్) ఓ ఎఫ్ఎం స్టేషన్ లో ఆర్జేగా ప‌నిచేస్తుంటాడు. ఓ యాక్సిడెంట్ కారణంగా తలకు గట్టిగా దెబ్బ తగలడంతో ఫేస్ బ్లైండ్ నెస్ డిజార్డర్ వస్తుంది. ఎదుటి వారి ముఖాల‌ను, వారి వాయిస్‌ను గుర్తుప‌ట్ట‌లేడు. త‌న‌కున్న స‌మ‌స్...