Hyderabad, మే 2 -- Panchayat 3 OTT Release Date: సస్పెన్స్ వీడింది. మొత్తానికి ఊరించి.. ఊరించి.. పంచాయత్ సీజన్ 3 (Panchayat 3) ఓటీటీ రిలీజ్ డేట్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో గురువారం (మే 2) అనౌన్స్ చేసింది. చాలా రోజులుగా ఈ కొత్త సీజన్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఊహించినట్లే ఈ నెలలోనే ఈ కొత్త సీజన్ వస్తోంది.

పంచాయత్ సీజన్ 3 మే 28 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆ ఓటీటీ వెల్లడించింది. చాలా రోజులు ఊరించి.. ఫ్యాన్స్ కు సొరకాయలు తొలగించే ఓ పెద్ద పని చెప్పి.. మెల్లగా ఈ కొత్త సీజన్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. మే నెలలోనే వస్తుందని బుధవారమే ప్రైమ్ వీడియో రివీల్ చేసినా.. తేదీని మాత్రం ఇవాళ (మే 2) వెల్లడించింది.

నీనా గుప్తా, జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్ నటించిన పంచాయత్ వెబ్ సి...