Hyderabad, మే 3 -- Netflix Top Trending Movies Web Series: పాపులర్ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ మధ్యే ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి. మరి వీటిలో ట్రెండింగ్స్ లో టాప్ లో ఉన్న సినిమాలు, సిరీస్ ఏవో తెలుసా? మూవీస్ లో కిరణ్ రావ్ డైరెక్ట్ చేసిన లాపతా లేడీస్.. వెబ్ సిరీస్ లో సంజయ్ లీలా భన్సాలీ అత్యంత భారీ బడ్జెట్ సిరీస్ హీరామండి టాప్ లో ఉన్నాయి.

మే నెల తొలి వీకెండ్ లో నెట్‌ఫ్లిక్స్ తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ పై ఉన్న ట్రెండింగ్ మూవీస్ లిస్ట్ రిలీజ్ చేసింది. వీటిలో లాపతా లేడీస్ నంబర్ వన్ గా ఉండటం విశేషం. ఓ చిన్న సినిమాగా రిలీజై.. థియేటర్లలోనూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. ఓటీటీలోనూ అదే రేంజ్ లో దూసుకెళ్తోంది. మహిళా సాధికారత అనే అంశాన్ని సరదాగా, ఆలోచింపజేసేలా ఈ మూవీ రూపొందించారు.

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ ఈ మూవ...