భారతదేశం, ఏప్రిల్ 19 -- Maruti Swift on road price Hyderabad : 2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్​పై ఇప్పటికే చాలా బజ్​ నెలకొంది. ఈ బెస్ట్​ సెల్లింగ్​ హ్యాట్​బ్యాక్​.. మే 9న ఇండియాలో లాంచ్​ అవుతుందని టాక్ ​నడుస్తోంది. వీటన్నింటి మధ్య.. ఈ కారుకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. పలు ఎంపిక చేసిన డీలర్​షిప్ షోరూమ్స్​లో.. లాంచ్​కు ముందే ప్రీ-బుకింగ్స్​ ఓపెన్​ అయ్యాయి. ఫోర్త్​ జనరేషన్​ స్విఫ్ట్​ను.. ఎంపిక చేసిన మారుతి సుజుకి ఎరీనా డీలర్​షిప్ షోరూమ్స్​లో రూ.11,000 టోకెన్ అమౌంట్​తో బుక్ చేసుకోవచ్చు. ధరలు లేదా డెలివరీలపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. త్వరలోనే వీటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్ గురించి వివరాలు తక్కువగా ఉన్నప్పటికీ, కొత్త తరం మోడల్ మల్టీ వేరియంట్లతో పాటు అనేక కలర్ ఆప్షన్లలో వస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయ...