Hyderabad, మే 10 -- OTT Malayalam Movies 2024: 2024 సంవత్సరం మలయాళం సినిమాకి చాలా ముఖ్యమైనది అని చెప్పొచ్చు. ఈ ఏడాది థియేటర్లలో చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. అలాగే అవి ఓటీటీలోకి విడుదలై మరింత రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ ఏడాది స్ట్రీమింగ్‌కు వచ్చిన 20కిపైగా మలయాళ సినిమాలు ఏంటో చూద్దాం.

మలయాళ వర్సటైల్ యాక్టర్, పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆవేశం. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ కామెడీ చిత్రంగా వచ్చిన ఈ సినిమా మే 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో మలయాళ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌లో నిలిచిన సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్. 20...