Hyderabad, మే 7 -- Krishna mukunda murari serial today may 7th episode: మీరా తమ బిడ్డని మోసేదని మురారికి తెలుస్తుంది. మురారి ఇక నుంచి తనని ప్రేమగా చూసుకుంటాడని అనుకుంటుంది. కారులో ఇంటికి వెళ్దామని పిలుస్తాడు. మీకెందుకు శ్రమ అని డ్రామా ఆడుతుంది. నువ్వు మా బిడ్డని మోస్తున్నావ్ కాలు కింద పెట్టకూడన చూసుకోవాలని చెప్పి తన చేతిని పట్టుకుని కారులో కూర్చోబెడతాడు.

ముకుంద మురారి పక్కన కూర్చున్నానని తెగ మురిసిపోతుంది. సంగీత ఏడుపు మొహం పెట్టుకుని ఉంటే మధు ఫోటో తీసి చూడు ఎలా ఉన్నావో ఎందుకు ఇలా ఉన్నావని అడుగుతాడు. ఎప్పుడు ఉండే గోల ఆదర్శ్ బావ నా మొహం చూడటం లేదంటే తనని వలలో వేసుకోవడం లేదని మా అమ్మ చంపుతుందని చెప్తుంది.

మధు తనని దృష్టిలో పెట్టుకోమని అంటూ ఇన్ డైరెక్ట్ గా నేనే నీకు మంచి సంబంధం చూస్తానని అంటాడు. అయితే ఈ సారి మీ అమ్మ ఉన్నప్పుడు ఆదర్శ్ దగ్గరక...