Hyderabad, మే 4 -- Krishna mukunda murari serial may 4th episode: ఆదర్శ్ ముకుందని పిలిచి షాపింగ్ కి వెళ్దామని అంటాడు. మనసులో ఆదర్శ్ ని తెగ తిట్టేస్తుంది. బట్టలు నీకోసం కొంటాను. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కొన్నే కట్టుకుంటున్నావ్. అది నాకు నచ్చలేదు అందుకే నేను నీకు బట్టలు కొంటానని అంటాడు.

మీది ఎంత మంచి మనసు ఆదర్శ్. నేను ముకుందగా ఉన్నప్పుడు కూడా నా మీద ఎవరూ ఇంతగా శ్రద్ధ చూపించలేదు. కానీ అదంతా వృధానే. ఈ జన్మకి నా మనసులో మురారికి తప్ప వేరొకరికి చోటు ఉండదని ముకుంద మనసులో అనుకుంటుంది. నేను ముకుందని కాకపోయి ఉంటే ఎప్పుడో మీకు పడిపోయి ఉండేదాన్ని అనుకుంటుంది.

కృష్ణకి వైదేహి ఫోన్ చేసి గుడ్ న్యూస్ అంటుంది. సరోగసి మథర్ తో మాట్లాడాను ఒప్పుకుందని హాస్పిటల్ కి వస్తే ఫార్మాలిటీస్ పూర్తి చేద్దామని చెప్తుంది. కృష్ణ చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడే భవానీ పాలు ...