భారతదేశం, మే 4 -- Kamakshi Bhaskarla: హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన మా ఊరి పొలిమేర 2 క‌మ‌ర్షియ‌ల్‌గా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ల‌చ్చిమిగా డీ గ్లామ‌ర్ పాత్ర‌లో యాక్టింగ్‌తో మెప్పించింది కామాక్షి భాస్క‌ర్ల‌. మా ఊరి పొలిమేర తో పాటు సీక్వెల్ న‌టిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

తాజాగా తెలుగులో కామాక్షి భాస్క‌ర్ల మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. నాగ‌చైత‌న్య లీడ్ రోల్‌లో విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన దూత వెబ్‌సిరీస్ ప్రేక్ష‌కుల‌కు థ్రిల్లింగ్‌ను పంచింది. ఓ జ‌ర్న‌లిస్ట్ జీవితంలో అదృశ్య శ‌క్తి క్రియేట్ చేసిన అల‌జ‌డిని ఉత్కంఠ‌భ‌రితంగా ఈ సిరీస్‌లో ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్‌. ఓటీటీలో దూత హిట్ట‌యింది.

దూత రిజ‌ల్ట్ నేప‌థ్యంలో మ‌రో వెబ్‌సిరీస్ చేసేందుకు నాగ‌చైత‌న్య‌, డైరెక్ట‌ర్ వ...