భారతదేశం, మే 16 -- Kalvan Review: జీవీ ప్ర‌కాష్ కుమార్‌, భార‌తీరాజా, ఇవానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన కాల్వ‌న్ మూవీ ఇటీవ‌ల డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజైంది. ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీకి పీవీ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న కాల్వ‌న్‌ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? లేదా? అంటే?

కెంబ‌న్ అలియాస్ కెంబ‌రాజు (జీవీ ప్ర‌కాష్ కుమార్‌) త‌న స్నేహితుడు సూరితో(దీనా) క‌లిసి అడ‌వి ప‌క్క‌న ఉన్న ప‌ల్లెటూళ్లో జీవిస్తుంటాడు. ఇద్ద‌రు అనాథ‌లు. ఊళ్లోనే చిన్న చిన్న దొంగ‌త‌నాలు చేస్తూ ప‌బ్బం గ‌డుపుకుంటారు. ఓ రోజు బాలామ‌ణి (ఇవానా) ఇంట్లో దొంగ‌తానినికి వెళ‌తారు కెంబ‌న్‌, సూరి. వారిని తెలివిగా పోలీసుల‌కు ప‌ట్టిస్తుంది బాలామ‌ణి. ఆమె ధైర్యం, అంద‌చందాలు చూసి బాలామ‌ణితో కెంబ‌న్‌ ప్రేమ‌లో ప‌డ‌తాడు. కెంబ‌న్ ప్రేమ విష‌యం తెలుసు...