భారతదేశం, ఫిబ్రవరి 8 -- దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన ఉత్పత్తి సంస్థ హ్యుందాయ్ (Hyundai) తన వాహన శ్రేణిలోని పలు వాహనాలపై రూ. 50 వేల వరకు డిస్కౌంట్ లను ప్రకటించింది. వినియోగదారులు గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా, ఐ20, వెర్నా, ఆల్కజార్, టస్కన్ మోడల్స్ పై ఈ తగ్గింపును పొందవచ్చు. హ్యుండై ఎక్స్ టర్, క్రెటా, అయోనిక్ 5 మోడల్స్ పై మాత్రం ఎలాంటి ప్రమోషనల్ ఆఫర్స్ అందుబాటులో లేవు.

ఈ సంవత్సరం జనవరి నెలలో హ్యుందాయ్ అత్యధిక నెలవారీ దేశీయ విక్రయాలను సాధించింది. ఈ సేల్స్ లో ఎక్స్‌టర్ (exter), క్రెటా (creta) మోడల్‌లదే సింహభాగం. హ్యుందాయ్ కంపెనీ జనవరిలో భారతీయ మార్కెట్లో మొత్తం 57,115 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించినట్లు నివేదించింది. వీటికి ఎగుమతి చేసిన కార్ల యూనిట్ల సంఖ్యను కూడా కలిపితే, మొత్తం అమ్మకాలు 67,615 యూనిట్లకు చేరుకున్నాయి.

హ్యుందాయ్ ప్రక...