భారతదేశం, మే 3 -- Guppedantha Manasu Serial: రాజీవ్‌ను మ‌ను నిజంగానే చంపాడ‌ని, నీ కొడుకు ఓ హంత‌కుడు అంటూ అనుప‌మ మ‌న‌సు నొచ్చుకునేలా మాట్లాడుతుంది దేవ‌యాని. వ‌సుధార‌పై మ‌న‌సు ప‌డ్డ మ‌ను ఆమె కోస‌మే రాజీవ్‌ను చంపి ఉంటాడ‌ని ఎగ‌తాళిగా మాట్లాడుతుంది. దేవ‌యాని మాట‌ల‌ను స‌హించ‌లేని అనుప‌మ ఆమెను కొట్ట‌డానికి వ‌స్తుంది. దేవ‌యానిని అనుప‌మ కొట్ట‌కుండా వ‌సుధార‌ అడ్డుకుంటుంది. దేవ‌యానికి తానే బుద్దిచెబుతాన‌ని అంటుంది.

దేవ‌యాని అనుప‌మ‌తో మాట్లాడిన మాట‌ల్ని మొబైల్‌లో రికార్డ్ చేస్తుంది వ‌సుధార‌. ఈ వీడియోను ఫ‌ణీంద్ర‌కు పంపిస్తుంది. ఆ వీడియో చూసి దేవ‌యానిపై కోపంతో ర‌గిలిపోతాడు ఫ‌ణీంద్ర‌. దేవ‌యాని చేసిన త‌ప్పుకు శైలేంద్ర చెంప‌పై గ‌ట్టిగా ఒక్క‌టి కొడ‌తాడు. త‌ల్లి త‌ప్పు చేస్తే త‌న‌కు శిక్ష ప‌డ‌టం చూసి శైలేంద్ర షాక‌వుతాడు. న‌న్ను ఎందుకు కొట్టారు అని తండ్రిని...