Hyderabad, మే 4 -- Garelu Recipe: కరకరలాడే మరమరాలతో క్రంచీ గారెలు చేసుకుంటే రుచి అదిరిపోతుంది. వీటిని ఇన్‌స్టెంట్‌గా చేసుకోవచ్చు. ముందుగానే గంటల పాటు పప్పును నానబెట్టాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు ఈ గారెలను వండుకొని తినేయొచ్చు. వీటిని చేయడం చాలా సులువు. క్రంచీగా ఉండే ఈ గాలిలో పిల్లలకు బాగా నచ్చుతాయి. మరమరాలతో గారెలు ఎలా చేయాలో తెలుసుకోండి.

మరమరాలు - మూడు కప్పులు

గోధుమ పిండి - పావు కప్పు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

పెరుగు - మూడు స్పూన్లు

నువ్వులు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

గరం మసాలా - పావు స్పూను

కారం - ఒక స్పూను

నిమ్మరసం - ఒక స్పూను

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

కొత్తిమీర తురుము - రెండు స్పూన్లు

1. ముందుగానే మరమరాలను నీటిలో వేసి నానబెట్టుకోవాలి.

2. ఇవి ఐదు నిమిషాల్లోనే నానిపోతాయి. వాటిని చేత్తోనే పిండి తీ...