భారతదేశం, మార్చి 9 -- Tata Motors EV discounts in March : ఇండియన్​ ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతోంది టాటా మోటార్స్​. ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ ఈవీ పోర్ట్​ఫోలియోకు విపరీతమైన డిమాండ్​ ఉంటుంది. చాలా మంది టాటా ఈవీలను కొనాలని చూస్తున్నారు. వీరిలో మీరూ ఒకరా? అయితే ఇది మీకోసమే! ఈ నెలలో పలు మోడల్స్​పై గరిష్ఠంగా రూ. 3.5లక్షల వరకు డిస్కౌంట్లు ఇస్తోంది టాటా మోటార్స్​ సంస్థ. వాటిని ఇక్కడ చూసేయండి.

ఇన్​వెంటరీని క్లియర్​ చేసుకునేందుకు తమ ఈవీలపై భారీ డిస్కౌంట్లను ఇస్తోంది టాటా మోటార్స్​. ఇవి.. 2023 మోడల్స్​కి మాత్రమే అమల్లో ఉన్నాయి. వీటితో పాటు 2024 నెక్సాన్​ ఈవీ, టియాగో ఈవీపైనా అట్రాక్టివ్​ ఆఫర్స్​ ఉన్నాయి.

బెస్ట్​ సెల్లింగ్​ టాటా నెక్సాన్​ ఈవీ ప్రైమ్​ వేరియంట్​పై రూ. 2.3లక్షల వరకు క్యాష్​ డిస్కౌంట్​ లభిస్తోంది. ఎక్స్​ఛేంజ్​ బోనస్...