Hyderabad, ఏప్రిల్ 27 -- Dal water: పప్పు నీళ్లను దాల్ వాటర్ లేదా దాల్ కా పానీ అని పిలుస్తూ ఉంటారు. ప్రతిరోజూ పప్పన్నం తినే వారి సంఖ్య ఎక్కువే. కాబట్టి ఆ పప్పు వండుకునే రోజు కచ్చితంగా పప్పు నీళ్లను కూడా తాగండి. ప్రతిరోజూ తాగితే ఇంకా మంచిది. పప్పులో ఉండే పోషకాలన్నీ ఈ పప్పు నీళ్లలో ఉంటాయి. ప్రోటీన్, క్యాల్షియం, పొటాషియం, ఫోలేట్, ఐరన్ ఇలా అన్నింటిని పప్పు నీళ్లు అందిస్తాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

పప్పు నీళ్లు చప్పగా ఉంటాయి కదా అనుకోవచ్చు. కాస్త టేస్టీగా చేసుకుంటే అవి కూడా రుచిగానే ఉంటాయి. కుక్కర్లో అరకప్పు కంది పప్పు శుభ్రంగా కడిగి వేయండి. కాస్త పసుపు పొడి, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోండి. నీళ్లు నాలుగు గ్లాసులు వేయండి. ఇలా వేయడం వల్ల పప్పు నీళ్లు అధికంగా వస్తాయి. ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించండి. తరువాత వడకట్టి పప్పును, పప్...