Hyderabad, ఏప్రిల్ 28 -- City Hunter Review In Telugu: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ 25న నేరుగా విడుదలైన జపనీస్ సినిమా సిటీ హంటర్ (City Hunter 2024). లైవ్ యాక్షన్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఇదే టైటిల్‌తో ఇంతకుముందు వెబ్ సిరీస్ వచ్చింది. అది భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అనంతరం 2011లో అనైమ్ (యానిమేషన్‌లో ఇదొక రకం) సినిమాగా కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే మంచి ఆదరణ పొందింది.

ఇక తాజాగా నేరుగా ఓటీటీలోకి లైవ్ యాక్షన్ సినిమాగా సిటీ హంటర్‌ను తీసుకొచ్చారు. యూచి సాటో దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రోహీ సుజుకీ, మిసాటో మొరిటా, మసనోబు అండో, అసుకా హనమురా, మిసాకి అయామే తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి నేరుగా వచ్చిన ఈ లైవ్ యాక్షన్ క్రైమ్ కామెడీ సినిమా ఎలా ఉందో సిటీ హంటర్ రివ్యూలో (City Hunter Review 2024) తెలుసుక...