Hyderabad, ఏప్రిల్ 27 -- Chandini Chowdary As Police Officer: యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో పేరు తెచ్చుకున్న చాందినీ చౌదరి అనేక సినిమాల్లో సైడ్ రోల్స్ చేసింది. మొదటిసారిగా కలర్ ఫొటోలో మెయిన్ హీరోయిన్‌గా నటించి సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా మంచి క్రేజ్ అందుకుంది. తర్వాత హీరోయిన్‌గా అనేక సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది బ్యూటిఫుల్ చాందినీ చౌదరి.

ఇటీవలే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రయోగాత్మక చిత్రం గామితో అలరించింది చాందినీ చౌదరి. ఇందులో ఓ కీలక పాత్రలో నటించి ఒదిగిపోయింది చాందినీ చౌదరి. ఇప్పుడు మరొ కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. చాందినీ చౌదరి తొలిసారిగా హీరోయిన్ ఒరియెంటెడ్ సినిమా చేస్తోంది. ఆ మూవీ పేరే యేవమ్. చాందినీ చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న యేవమ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు.

శుక్రవ...