Hyderabad, మే 3 -- Bharti Singh Hospitalised: తన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించే కమెడియన్ భారతీ సింగ్ హాస్పిటల్లో చేరింది. కొన్ని రోజులుగా తాను కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు ఆమె తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసిన వీడియోలో వెల్లడించింది. గాల్‌బ్లాడర్లో రాళ్లను తొలగించడానికి డాక్టర్లు ఆమెకు సర్జరీ చేయనున్నారు. నొప్పి భరించలేక ఏడుస్తూ ఆమె ఈ వీడియో చేసింది.

హాస్పిటల్ బెడ్ పై నుంచే కమెడియన్ భారతీ సింగ్ ఈ వీడియో చేసింది. ముంబైలోని కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్లో ఆమె చేరింది. కొన్ని రోజులుగా తాను ఎంతలా కడుపు నొప్పితో బాధపడుతున్నానో ఆ వీడియోలో ఆమె వివరించింది. మొదట్లో తాను పెద్దగా పట్టించుకోలేదని, అయితే నొప్పి భరించలేనంతగా పెరిగిపోయినట్లు భారతీ తెలిపింది.

ఆ తర్వాత హాస్పిట్లో చేరిన ఆమెకు టెస్టులు నిర్వహించడంతో గాల్‌బ్లాడర్లో రాళ్లు ఉన్నట్లు డాక...