Hyderabad, ఏప్రిల్ 25 -- Baby Food: నెలల పిల్లలకు పెట్టే ఆహారాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి కొనాలి. బయట దొరికే సెరెలాక్ లాంటి ఉత్పత్తుల్లో చక్కెర కలుపుతున్నట్టు వార్తలొచ్చాయి. కాబట్టి చిన్నపిల్లలకు ఇంట్లోనే సెరెలాక్ పొడిని తయారుచేసి తినిపించడం మంచిది. రాగి పిండితో బేబీ ఫుడ్ ను తయారు చేయవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. రాగి పిండితో బేబీ ఫుడ్ తయారు చేసి స్టోర్ చేసుకుంటే మూడు నెలల పాటు వాడుకోవచ్చు. దీన్ని చేయడం కూడా చాలా సులువు.

రాగులు - ఒక కప్పు

బియ్యం - అరకప్పు

బాదం పలుకులు - గుప్పెడు

పెసరపప్పు - పావు కప్పు

1. రాగులు, బియ్యం, పెసరపప్పు మూడింటిని శుభ్రంగా కడిగి నీడలోనే ఆరబెట్టాలి.

2. అవి పొడిపొడిగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రాగులు, బియ్యం, పెసరపప్పు, బాదంపప్పు వేయించుకోవాలి.

4. అవి బాగా వ...