భారతదేశం, ఏప్రిల్ 28 -- Aamir Khan: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్.. ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. సినిమాల కోసం ఎంత కష్టపడేందుకైనా ఆయన సిద్ధపడతారు. అందుకే ఆమిర్‌ను అందరూ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అంటారు. తాను చేస్తున్న పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ఆయన ఎంతైనా కృషి చేస్తారు. ఆమిర్ కెరీర్లో పీకే చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. ఆ మూవీలో విభిన్నమైన నటనతో ఆయన అందరినీ మెప్పించారు. అయితే, ఆ సినిమాలో ఓ సీన్‍ను తాను పూర్తి నగ్నంగా చేయాల్సి వచ్చిందని ఆమిర్ వెల్లడించారు. ఆ వివరాలివే..

కపిల్ శర్మ హోస్ట్ చేస్తున్న'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'కు ఆమిర్ ఖాన్ వచ్చారు. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ టాక్‍ షోలో తన కెరీర్లో ఎదురైన కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి ఆమిర్ పంచుకున్నారు. ఈ సందర్భంగానే పీకే మూవీలో తన ఇంట్రడక్షన్ సీన్ షూటింగ్ గురించి వివరించారు...